అతడు..మహేష్ భారీ కటౌట్లు!

3
- Advertisement -

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన అతడు చిత్రం మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. 2025 ఆగస్టు 9న ఈ చిత్రం రీ-రిలీజ్ కానుండగా, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ సృష్టించిన ఈ అద్భుతాన్ని మళ్లీ వెండితెరపై చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రిమాస్టర్డ్ వెర్షన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు అభిమానులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తున్నారు. హైదరాబాద్ RTC క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్, అలాగే విశ్వనాథ్ థియేటర్ వద్ద మహేష్ బాబు భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.

బుకింగ్స్ ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. త్రిషా కథానాయికగా నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో నాజర్, బ్రహ్మానందం, సోను సూద్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. మణి శర్మ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా నిలిచింది.

Also Read:భారత్‌పై ట్రంప్ మరో బాంబ్..!

- Advertisement -