గ్యాంగ్‌లీడర్‌కి సైడ్‌ ఇచ్చిన వాల్మీకి..!

685
varun nani
- Advertisement -

గతంలో సాహో కోసం చిన్న సినిమాలు సైడ్ ఇవ్వగా వాల్మీకి కూడా తప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా సాహో ఆగస్టు 30న విడుదల కానుంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 6న వరుణ్ తేజ్ వాల్మీకి రిలీజ్ కానుందని ప్రకటించారు. సాహో విడుదల తర్వాత వారం రోజులకే వరుణ్ సినిమా విడుదల కానుండటంతో ఈ రెండు సినిమాల కలెక్షన్లపై ప్రభావం చూడనుండటంతో రిలీజ్ డేట్‌ని మార్చుకున్నారు వరుణ్.

ప్టెంబర్ 13న సినిమా విడుదల కానుందని ప్రకటించారు. అయితే సాహోకి సైడ్‌ ఇచ్చినా గ్యాంగ్ లీడర్‌ నానితో ఢీ కొట్టే పరిస్థితి వచ్చింది. నాని నటించిన గ్యాంగ్ లీడర్‌ సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకురానుండటంతో మరోసారి బాక్సాఫీస్ రేసు నుంచి వరుణ్ తప్పుకోవాల్సిన పరిస్ధితి వచ్చింది.

తాజాగా మరోసారి వాల్మీకి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు చిత్ర నిర్మాతలు. సెప్టెంబర్ 20న వాల్మీకి విడుదల కానుందని ..నాని,వరుణ్ ల మధ్య పోటీ ఉంటే.. దానివలన రెండు సినిమాలకు ఇబ్బంది కలుగుతుంది. అందుకే వాల్మీకి సినిమా విడుదల తేదీని వాయిదా వేశామని చెప్పారు.

- Advertisement -