బాక్సర్‌గా గద్దలకొండ గణేష్..!

693
varun tej
- Advertisement -

ఎఫ్‌2,గద్దలకొండ గణేష్‌ సినిమాలతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు వరుణ్ తేజ్. హరీష్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో వరుణ్ తేజ్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఇక ఈ మూవీ తర్వాత కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యాడు వరుణ్.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఇవాళ ప్రారంభమయ్యాయి. వరుణ్ తేజ్ 10వ సినిమాగా తెరకెక్కుతుండగా బాక్సర్‌గా కనిపించనున్నారు. రెనైసాన్స్ పిక్చర్, అల్లు వెంకటేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రానికి జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా తమన్ సంగీతం అందించనున్నాడు.

- Advertisement -