శశికళ ఎపిసోడ్‌పై వర్మ ఆసక్తికర ట్విట్

297
Varma tweets on sasikala Verdict
- Advertisement -

అంతా ఉహించినట్టే జరిగింది. ఆదాయానికి మించిన ఆస్తులున్న కేసులో శశికళను దోషిగా ప్రకటిస్తు సుప్రీం తీర్పు వెలువరించింది.  ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివంగత మాజీ సీఎం జయలలితతో పాటు శశికళ,ఇళవరసి,సుధాకరణ్‌ దోషులేనని తెలిపింది. చిన్నమ్మకు నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో పాటు పదికోట్లు జరిమాన విధిస్తూ దేశ అత్యున్నత న్యాయ స్థానం తీర్పు వెల్లడించింది.

ఈ నేపథ్యంలో వర్మ మరోసారి ట్విట్‌ అస్త్రాలను సంధించాడు. అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత అన్నాడీఎంకేలోని ఒక వర్గం సంబరాలు జరుపుకుంటోందని… అయితే ఈ కేసులో ప్రథమ దోషి అమ్మ జయలలితే అనే విషయాన్ని వారు మర్చిపోయినట్టున్నారని ఆర్జీవీ ఎద్దేవా చేశాడు. జయలలిత బతికుంటే… సుప్రీంకోర్టు తీర్పుతో ఆమె కూడా జైలుకు వెళ్లుండేవారని ట్వీట్ చేశాడు. కాలం చాలా విచిత్రమైనదని… ఇప్పటి దాకా శశికళ బందీలుగా ఎమ్మెల్యేలు ఉంటే… కోర్టు తీర్పు తర్వాత ఎమ్మెల్యేలు స్వేచ్ఛను పొందితే, శశికళ బందీగా మారిందని అన్నాడు.

ఇక సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ తలరాత మొత్తం మారిపోయిందని అన్నాడు. ముఖ్యమంత్రి కావాలనుకున్న శశి… జైలుకు వెళ్లబోతోందని చెప్పాడు. ఈ నేపథ్యంలో తన నెచ్చెలి శశికళ పరిస్థితిని చూసి జయ ఆత్మ క్షోభిస్తుందని అన్నాడు. జయ ఆత్మ కచ్చితంగా శాంతించదని ట్వీట్ చేశాడు.

మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత పన్నీర్ సెల్వం నివాసం వద్ద ఆయన వర్గీయులు టపాసులు కాల్చి, డ్యాన్సులు వేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. బందీలుగా ఉన్న ఎమ్మెల్యేల‌కు విముక్తి క‌లిగిస్తామని వారు నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో ప‌న్నీర్ వ‌ర్గం దూకుడుగా ముందుకు వెళుతుండ‌డంతో, నిన్నటి వ‌ర‌కు హుషారుగా క‌నిపించిన శ‌శిక‌ళ వ‌ర్గం సుప్రీం తీర్పుతో నిరాశ‌లో కూరుకుపోయింది.

- Advertisement -