పెళ్లి వద్దూ.. కానీ తల్లి కావాలా ?

49
- Advertisement -

లేడీ విలన్ వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి పై షాకింగ్ సమాధానం ఇచ్చింది. ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న సిక్స్త్ సెన్స్ కార్యక్రమానికి గెస్ట్ గా వరలక్ష్మీ హాజరైంది. ఈ షోలో పెళ్లి పై ఓంకార్ అడిగిన ఓ ప్రశ్నకు వరలక్ష్మీ షాకింగ్ సమాధానం ఇచ్చింది. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని ఓంకార్ అడగగా.. ఆమె వేళ్ళతో క్రాస్ సిగ్నల్ చూపించింది. దానికి అర్థం ఏమిటి అంటే.. పెళ్లి అంటేనే ఓ భూతం అని.. పెళ్లి మ్యాటర్ నా వద్దకు రావద్దు అని, అందుకే ఇలా పెట్టాను అంటూ చెప్పింది. అయితే ఆ మధ్య తనకు తల్లి కావాలని ఉందని వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పుకొచ్చింది.

మరి పెళ్లి ఇష్టం లేదు గానీ, తల్లి కావాలని అనుకోవడం ఏమిటో?.. వరలక్ష్మీకే తెలియాలి. అయినా ఈ మధ్య హీరోయిన్లు పెళ్లికి ముందే తల్లి కావడం కామన్ అయిపోయింది. రీసెంట్ గానే గోవా ముదురు భామ ఇలియానా కూడా తానూ ప్రెగ్నెంట్ అంటూ ఇన్స్టా లో ప్రకటించిన విషయం తెలిసిందే. పైగా ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెంట్ స్టేటస్ ను ఫ్యాన్స్ తో పంచుకుంటూ రెచ్చిపోతూనే ఉంది ఈ హాట్ బ్యూటీ. ముఖ్యంగా ఫుల్ బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసి అందరికీ షాక్ ఇస్తూనే ఉంది.

Also Read:ఈ కోర్సులు చేస్తే..ఉద్యోగాలు గ్యారెంటీ

మరోసారి గోవా బ్యూటీ ఇలియానా బికినీలో రచ్చ చేసింది. ఎల్లో కలర్ డ్రెస్‌లో కూల్ గ్లాసెస్ ధరించి సెల్ఫీ దిగింది. ఎద అందాలను ఆరబోస్తూ కుర్రకారు మతిపోగొడుతోంది. ఈ ఫొటోల్లో ఇలియాన బేబీ బంప్స్ క్లియర్‌గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈబేబి పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన విషయం తెలిసిందే. బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని మాత్రం సస్పెన్స్‌గా ఉంచుతోంది. మరి ఇలియానా లానే వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా ముందుకు వెళ్తుందేమో చూడాలి.

Also Read:Adipurush:అంతిమ విజయం సత్యానిదే

- Advertisement -