ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన వారికి న్యాయం చేస్తాంః వంటేరు

365
Vanteru
- Advertisement -

కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ భూనిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి. గజ్వెల్ నియోజకవర్గంలో కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ లో ముంపునకు గురవుతున్న తానేదారుపల్లి వాసులకు తునికిబొల్లారం గ్రామంలో ఆర్ అండ్ ఆర్ కాలనిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో 82 కుటుంబాల సామూహిక గృహప్రవేశాలు చేయించారు. ఈకార్యక్రమంలో వంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పాల్గోన్నారు.

ఈసందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. కొండపోచమ్మ ప్రాజెక్టులో 1800కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విదంగా అన్ని సౌకర్యాలతో ఆధునాతన పద్దతిలో నిర్మించిన అర్ అండ్ ఆర్ కాలనిలో గృహప్రవేశాలు చేసుకుంటున్నాం. ఈ ప్రాంతా నిరుద్యోగుల కోసం 600 ఎకరాల్లో పరిశ్రమలు రాబోతున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విదంగా కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు అత్యుత్తమ ప్యాకేజి ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఏడాదిన్నర లొనే కొండపోచమ్మ సాగర్ నిర్మించుకున్నాం. ప్రాజెక్టులు అంటే గతంలో దశాబ్దాలు పట్టేది.. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టులను కొద్ది సంవత్సరాల్లోనే నిర్మిస్తున్నది. ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులందరికి ఫిషరింగ్ సొసైటీ ద్వారా శాశ్వత ప్రయోజనం కల్పించబోతున్నట్లు తెలిపారు.

కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. కొత్త అర్ అండ్ ఆర్ చట్టం వచ్చాక మొట్టమొదటి సారిగా సిద్దిపేట జిల్లాలో ప్రారంభించుకుంటున్నాం.సిద్దిపేట జిల్లాలో రిజర్వాయర్లు ఎక్కువ.. భౌగోళికంగా జిల్లా ఎత్తాయిన ప్రదేశంలో ఉండడం వల్ల ఇక్కడ ప్రాజెక్టులు నిర్మించి 13 జిల్లాలకు ఇక్కడి నుంచి తాగు, సాగు నీరు అందిస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విదంగా గత మూడునాలుగు ఏళ్లలో 45 వేల ఎకరాల భూమి సేకరించాం. రైతులను మెప్పించి, ఒప్పించి దేశంలో ఎక్కడా కూడా ఇవ్వని విదంగా మెరుగైన ప్యాకేజి ఇచ్చి భూ సేకరణ చేసాం. సిద్దిపేటలో ఉన్న ప్రతి ఎకరం కాళేశ్వరం నీటితో సస్యశ్యామలం కాబోతున్నదని చెప్పారు.

- Advertisement -