కొండపొచమ్మ, మల్లన్న సాగర్ నీళ్ళు వదిలితే నిజాం సాగర్ వరకు నీళ్లు వెళ్తాయన్నారు బీఆర్‌ఎస్ నుత, మాజీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. గజ్వేల్ పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో మీడియాతో మాట్లాడిన వంటేరు.. మల్లాన్నసాగర్, కొండాలోచమ్మ సాగర్ నిర్మాణాల కోసం సిద్దిపేట జిల్లా రైతాంగం పొలాలు ఇచ్చి త్యాగాలు చేశారు అన్నారు.
మల్లన్న సాగర్ నీళ్ళు వదలడం వల్ల కూడవీళ్లి, హెల్దీ వాగుల ద్వారా వంద కిలోమీటర్ల మేర రైతాంగానికి లక్షల ఎకరాలకు నీళ్ళందుతాయన్నారు. నాట్లు వేసుకొని రైతాంగ ఎదురు చూస్తుంది కావున వెంటనే నీళ్ళు విప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు. నీళ్ళు విప్పితే ట్రాక్టర్ ఎక్కుతము, లేదంటే రోడ్లు ఎక్కుతామని తేల్చిచెప్పారు. నీళ్ళు ఇప్పని యెడల మేమే కొండపోచమ్మా, మల్లమ్మ సాగర్ గేట్లను ఎత్తుకునే పరిస్థితి వస్తదని తేల్చి చెప్పారు.
Also Read:జగన్ మళ్లీ జైలుకే..బీజేపీ మంత్రి సంచలన కామెంట్స్!