బీజేపీకి అమ్ముడు పోయి రేవంత్:ప్రతాప్‌ రెడ్డి

22
vanteru

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన… బీజేపీకి అమ్ముడుపోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. నాడు టీడీపీని కాంగ్రెస్ కు అమ్మి… నేడు కాంగ్రెస్ ను బీజేపీకి అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

రాజకీయ రచ్చ చేసి రొచ్చు చేయాలని రేవంత్ చూస్తున్నారని, పెద్ద పెద్ద వాళ్ళు కూర్చున్న గాంధీ భవన్ కుర్చీలో ఒక చిల్లర గాన్ని కూర్చో బెట్టారని. గాంధీ భవన్ కు త్వరలోనే తాళం పెట్టిస్తాడని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ రైతు బిడ్డ.. రేవంత్ రెడ్డి కమర్షియల్ బిడ్డ… ఏది ఎక్కడ ఎంతకు అమ్ముకోవాలనే చూస్తారని, ఎర్రవెల్లి గ్రామానికి వస్తే తరిమికొడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారని వెల్లడించారు.