వంగవీటి మోహనరంగా జీవిత కథ ఆధారంగా రామ్‌గోపాల్‌వర్మ ‘వంగవీటి’ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో వంగవీటి రత్నకుమారి పాత్రకి ప్రముఖ బుల్లితెర నటి నైనా గంగూలీని ఎంపిక చేశారు. వంగవీటి రంగాని చంపిన తర్వాతే వంగవీటి రత్నకుమారి బాగా ఫోకస్ అయ్యారు. వంగవీటి హత్య జరగకముందు ఆమె అనుభవించిన భావోద్వేగాలని అభినయించగలిగే నటి కోసం బాగా అన్వేషించిన అనంతరం నైనా గంగూలీని ఎంపిక చేసారు వర్మ.
సాధారణంగా రామ్ గోపాల్ వర్మ హీరోయిన్స్ అందరూ హాట్ హాట్ గానే ఉంటారు.. అందుకే ఆయన పరిచయం చేసిన భామలందరూ కేక పుట్టించే హీరోయిన్స్ గా పాపులర్ పొందారు. సంచలన దర్శకుడిగా పేరున్న రామ్ గోపాల్ వర్మ తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఏదైనా చేయడానికి వెనుకాడడన్న విషయం అందరికి తెలిసిందే. ‘వంగవీటి’ మూవీ పబ్లిసిటీలో భాగంగా రామ్ గోపాల్ వర్మ తనదైన వ్యూహాలు రచిస్తున్నాడు. అందులో భాగంగానే నైనా గంగూలీతో మత్తెక్కించే సెక్సీ ఫోజులతో ఫోటో షూట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
వంగవీటి సినిమాలో రత్నకుమారిగా నైనా గంగూలీ డీ గ్లామరస్ పాత్ర చేసింది. అయితే రత్నకుమారిని అవమానించేలా ఆ ఫోటోషూట్ ఉందంటూ వంగవీటి ఫ్యాన్స్.. ఫాలోవర్లు మండిపడుతున్నారు. రత్నకుమారిపై తమకు గౌరవం ఉందని.. అలాంటి పాత్ర చేస్తున్న నైనా హాట్ ఫోటో షూట్ పై వంగవీటి అభిమానులు గరం.. గరంగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ ఫోటో షూట్ ద్వారా తాను గ్లామర్ రోల్స్ కూడా చేయడానికి సిద్ధం అని సంకేతాలు ఇవ్వడానికే ఇలా బికినీలో హఆట్ ఫోటో షూట్ కు ప్లాన్ చేసినట్లు టాక్. నైనా గంగూలీ బుల్లితెర నుండి రావడంతో ఆమె గురించి ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. అయితే వంగవీటి సినిమా తర్వాత నైనా గంగూలీకి అవకాశాలు వెల్లువెత్తుతాయని అంటున్నారు విశ్లేషకులు.