సుమంత్‌ ‘మళ్ళీ మొదలైంది’ నుండి ఫస్ట్ సింగిల్..

97
Malli Modalaindi

సుమంత్‌, నైనా గంగూలీ జంట‌గా టీజీ కీర్తికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రెడ్ సినిమాస్ బ్యాన‌ర్‌పై కె.రాజ‌శేఖ‌ర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్నఈ చిత్రంలో సుహాసిని మ‌ణిర‌త్నం, వెన్నెల కిషోర్‌, మంజుల ఘ‌ట్ట‌మ‌నేని, పోసాని కృష్ణ ముర‌ళి త‌దిత‌రులు నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ విడుదలైంది. దీన్ని యంగ్ హీరో నితిన్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు.

‘ఏంటో ఏమో జీవితం.. ఎందుకిలా చేస్తాదో జీవితం’ అంటూ సాగే ఈ పాటను కృష్ణ చైతన్య రాయగా సాయిచరణ్‌ పాడాడు. అనూప్ రూబెన్స్ స్వరాలు అందించాడు. సహజంగా ఇలాంటి రిలికల్ వీడియోస్ రెగ్యులర్‌గా ఒకే పేట్రన్ లో ఉంటాయి. కానీ వాటికి కాస్తంత భిన్నంగా దీన్ని సినిమా షూటింగ్ ప్రారంభం నుండి మేకింగ్ కు సంబంధించిన సీన్స్‌తో నడిపారు. దాంతో ప్రధాన తారాగణంతో పాటు టెక్నీషియన్స్‌కూ ఈ వీడియోలో చోటుదక్కింది. హీరోహీరోయిన్లు సుమంత్, నైనా గంగూలీతో పాటు పోసాని, ఘట్టమనేని మంజుల, సుహాసిని, అన్నపూర్ణమ్మ, ‘వెన్నెల’ కిషోర్ తదితరులు ఇందులో ఉన్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో చక్కటి ఫ్యామిలీ బాండింగ్ కూడా ఉందని ఈ లిరికల్ వీడియో చూస్తే అర్థమౌతోంది.

Ento Emo Jeevitham - Lyrical | Malli Modalaindi | Sumanth,Naina Ganguly | Anup Rubens|Keerthi Kumar