జానపద శిఖరం, ప్రజాకవి వంగపండు ప్రసాదరావు ఇకలేరు. గుండెపోటుతో ఇవాళ ఉదయం తన స్వస్థలం విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటికే పరిమితమయ్యారు.
ఉత్తరాంధ్ర గద్దర్‌గా పేరు తెచ్చుకున్నారు వంగపండు. వంగపండు 1972లో గద్దర్ తో కలిసి జన నాట్యమండలిని స్థాపించారు. ఆయన మూడు దశాబ్ధాలలో 300లకు పైగా పాటలు రాశారు. ఆయన రాసిన కొన్ని పాటలు పది బాషలలోకి అనువదించబడ్డాయి. ఆయన రాసిన ఏం పిల్లడో ఎల్దమొస్తవా పాట ఇప్పటికే ఎవర్‌గ్రీన్.ఆయన మృతిపట్ల కవులు,కళాకారులు సంతాపం ప్రకటించారు.
వంగపండు 1943 జూన్ లో జగన్నాథం, చిన్నతల్లి దంపతులకు పార్వతీపురం పెందబొండపల్లిలో జన్మించారు. బొబ్బిలో ఐటీఐ చేశారు. ఉద్యమంలో చేరిన ఏడాదికే ఆయనకు విశాఖ షిప్ యార్డులో ఫిట్టర్ మెన్ గా ఉద్యోగం వచ్చింది. ఆయినా కూడా ఆయన ఉద్యమమే ఎక్కువ అనుకొని ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.