వంగపండు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం..

405
vangapandu
- Advertisement -

ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు వంగపండు ప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల బాధలు- సమస్యలు, ప్రజా ఉద్యమాలే ఇతి వృత్తంగా పాటలు రాసి, పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జీవితాంతం పాటుపడ్డారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గుండెపోటుతో ఇవాళ ఉదయం తన స్వస్థలం విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో కన్నుమూశారు వంగపండు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఉత్తరాంధ్ర గద్దర్‌గా పేరు తెచ్చుకున్నారు వంగపండు. వంగపండు 1972లో గద్దర్ తో కలిసి జన నాట్యమండలిని స్థాపించారు. ఆయన మూడు దశాబ్ధాలలో 300లకు పైగా పాటలు రాశారు. ఆయన రాసిన కొన్ని పాటలు పది బాషలలోకి అనువదించబడ్డాయి.

- Advertisement -