బంగారం భగభగ…రికార్డు స్ధాయికి చేరిక!

175
Gold Rate Today Live
- Advertisement -

పసిడి భగభగమంటోంది. రోజురోజుకి పెరుగుతున్న బంగారం ధరలతో బంగారం సామాన్యులకు అందనంటోంది.హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.56,590కు చేరగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 పెరిగి రూ.51,880కు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ఆల్ టైం గరిష్టానికి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.52,450కు చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరుగుదలతో రూ.53,650కు చేరింది.

పసిడితో పోటీపడుతూ వెండి కూడా భారీగా పెరుగుతూ వస్తూనే ఉంది. కేజీ వెండి ధర రూ.290 పెరుగుదలతో రూ.65,400కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

- Advertisement -