ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ పూజా హెగ్దె. మొదటి సినిమా లోనే తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ భామ. ఒక్క సినిమాతోనే ఈ అమ్మడుకు బాలీవుడ్ లో ఆఫర్ వచ్చింది. రెండవ సినిమాతోనే బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మడుకు…ఆ సినిమా అక్కడ ప్లాప్ కావడంతో కొన్ని రోజులు కనిపించకుండా పోయింది. ఇక తెలుగులో ఆతర్వాత నాగచైతన్యతో వచ్చిన ఒక లైలా కోసం సినిమాలో హీరోయిన్ గా నటించినా ఆ సినిమాకూడా అంతగా హిట్ సాధించక పోవడంతో ఇక అమ్మడు కెరీర్ అయిపోయిందనే అనుకున్నారు ప్రేక్షకులు. బాలీవుడ్ లో ఆఫర్లు రాకపోయేసరికి ఈ అమ్మడు మళ్లి తెలుగు ఇండస్ట్రీ వైపు కన్నెసింది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో ఛాన్స్ కొ్ట్టి తన అందాలతో ప్రేక్షకులన మైమరపించింది. డీజే సినిమా తనకు మరో అదృష్టంగా చెప్పుకొవచ్చు. ఎందుకంటే ఈసినిమాలో చేసిన ఎక్స్ పోజింగ్ కు తనకు మరిన్ని సినిమాలలో ఆఫర్లను కట్టబెట్టింది. తాజాగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న మూవీలో పూజా హెగ్దెను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ఈ అమ్మడు రంగస్ధలం సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి తన అందాలను తెలుగు తెరకు మరింత పరిచయం చేసి ఆఫర్లు కొట్టేస్తుంది. తాజాగా మరో టాప్ హీరో సినిమాలో కూడా పూజా ఛాన్స్ కొ్ట్టేసింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రానున్న సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. తన కెరీర్ ముగిసింది అనే సమయానికి స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ బిజిగా గడుపుతుంది పూజా హెగ్ధె.