గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం వాల్మీకి. మలయాళంలో హిట్ కొట్టిన జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకురానుంది.
సినిమా ప్రమోషన్లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు హరీష్. పవన్‌తో గబ్బర్ సింగ్‌ని తెరకెక్కించి లైమ్ లైట్లోకి వచ్చిన హరీష్ మరోసారి ఆయనతో సినిమా చేసేందుకు సిద్ధమని తెలిపాడు. ఫ్యాన్స్‌తో పాటు అంతా సినిమా త్వరగా జరగాలని కోరుకోండి. నేను కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడెప్పుడు చేయాలా? అని ఎదురు చూస్తున్నాను.. ఆయన ఎప్పుడంటే అప్పుడే అన్నారు. ఎన్టీఆర్ తో చేసిన సినిమా ఫెయిల్ అయ్యిందని, తప్పకుండా మరో హిట్ సినిమా చేస్తానని పేర్కొన్నాడు.
వరుణ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఈ సినిమాలో పాత్రను డిజైన్ చేశానని తెలిపారు హరీష్. ఈ మూవీలో శోభన్ బాబు సినిమాలోని సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నామని తెలిపారు. ‘దేవత’ సినిమాలోని హిట్ సాంగ్ ‘ఎల్లువొచ్చి గోదారమ్మ వెల్లాకిల్లా పడ్డాదమ్మో’ పాట కొత్తగా ఉంటుందని తెలిపారు. ఈ పాట కోసం ప్రత్యేకంగా తమిళనాడులో 1200 బిందెలు తయారు చేయించామని…. ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని చెప్పారు.