ఆగస్టు 15…నేను సైతం అంటున్న వాల్మీకి..

459
varun tej valmiki

మెగా హీరోలు అల్లు అర్జున్,వరుణ్ తేజ్‌ ఆగస్టు 15 సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేస్తుండగా పంద్రాగస్టు సందర్భంగా టైటిల్‌ని రివీల్ చేయనున్నారు. ఇక వరుణ్ తేజ్ సైతం వాల్మీకి టీజర్‌తో అలరించనున్నాడు.

హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే హీరోహీరోన్‌గా నటిస్తుండగా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో రెండు రోజుల్లో ఉన్మాదం మొదలైపోతుంది…‘వాల్మీకి’ టీజర్ కోసం వేచి చూస్తూ ఉండండి అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు వరుణ్ తేజ్‌.

తమిళ సూపర్ హిట్ చిత్రం ‘జిగర్తాండ’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ప్రీ టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ టీజర్‌లో వరుణ్ కిల్లింగ్ లుక్‌ చూసి ఫ్యాన్స్‌ అయిపోయారు.

14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. వ‌రుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో న‌టిస్తుండ‌గా.. త‌మిళ హీరో అధ‌ర్వ ముర‌ళి కీల‌క పాత్ర పోషిస్తున్నారు.