ఆగస్టు 15…ముస్తాబవుతోన్న గోల్కొండ

650
august 15th
- Advertisement -

ఆగస్టు 15 సందర్భంగా గోల్కొండ కోట ముస్తాబవుతోంది. ఇప్పటికే గోల్కొండ కోట పరిసర ప్రాంతాలను సుందరంగా ముస్తాబు చేశారు. ధగధగలాడే విద్యుత్ దీపాల వెలుగులో గోల్కొండ వెలిగిపోతోంది. సీఎం కేసీఆర్ ఆగస్టు 15న ఉదయం తొలుత పరేడ్ గ్రౌండ్‌లో వీరుల సైనిక్ స్మారక్ వద్ద శ్రద్ధాంజలి ఘటించనున్నారు. అనంతరం రాణీమహల్ గార్డెన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.

ఇప్పటికే గోల్కొండ కోటను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు . ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో 8 కేంద్రాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించారు.

వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వేదిక వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించడంతో ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో రాజ్‌భవన్, సచివాలయం, శాసనసభ, హైకోర్టు, చార్మినార్, గన్‌పార్క్, క్లాక్ టవర్ తదితర వారసత్వ, చారిత్రక కట్టడాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.

గోల్కొండ కోటకు వెళ్లే రహదారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింభించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. మొత్తంగా పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లుచేస్తున్నారు అధికారులు.

- Advertisement -