- Advertisement -
జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వకీల్ సాబ్‌తో వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తున్న పవన్..బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ స్పెషల్ మోషన్ పోస్టర్‌ని విడుదల చేసింది.
ఒక చేతిలో క్రిమినల్ లా పట్టుకొని, మరొక చేతిలో క్రిమినల్స్ ను తరిమి కొట్టేందుకు బేస్ బాల్ బ్యాట్ పట్టుకొని సీరియస్ లుక్‌తో పాటు సత్యమేవ జయతే చివర్లో వచ్చే సందేశం యూ ట్యూబ్ లో దూసుకుపోతున్నది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీకపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే 90శాతం సినిమా షూటింగ్ పూర్తికాగా కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ వాయిదా పడింది.
- Advertisement -