మొక్కలు నాటిన మండలి కార్యదర్శి నరసింహాచార్యులు..

234
green challenge
- Advertisement -

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశీస్సులతో, స్పూర్తి తో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఘనంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అప్రతిహంగా కొనసాగుతోంది. అందులో భాగంగా వి. సి. సజ్జానార్, ఐ. పి. ఎస్., కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్ శాసన మండలి కార్యదర్శి డాక్టర్ వి. నరసింహాచార్యులుని నామినేట్ చేయడం, వారు దాన్ని స్వీకరించి నేడు శాసన సభ ప్రాంగణం లో మూడు మొక్కలను నాటడం జరిగింది.

ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యకరమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే సత్ సంకల్పంతో శాసన మండలి కార్యదర్శి డాక్టర్ వి. నరసింహాచార్యులు శాసన పరిషత్తు డెప్యూటీ చైర్మన్ శ్రీ నేతి విద్యా సాగర్ గారిని, శాసన సభ ఉప సభపతి పద్మా రావు గౌడ్ గారిని, శాసన పరిషత్తు చీఫ్ విప్ బొడకుంటి వెంకటేశ్వర్లుని మరియు అలంపూర్ నియోజకవర్గ శాసన సభ సభ్యులు వి. ఎం. అబ్రహం ని ప్రపోజ్ చేస్తూ నామినేట్ చెయ్యడం జరిగింది. వీరందరూ కూడా ఈ గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి, ఒక్కొక్కరు మూడేసి మొక్కల చొప్పున నాటి, వాటిని పరిరక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని ఆశించడం జరుగుతోంది.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య క్రమాన్ని ప్రారంభించిన సంతోష్ కుమార్ కి శాసన మండలి కార్యదర్శి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేయడంతోబాటు, తనను కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములను చేసినందుకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ గారికి కతజ్ఞతలు తెలియజేశారు.ఈ విధంగా కార్యక్రమం దిగ్విజయంగా సాగినట్లైతే, రాష్ట్రంలో వాతావరణ సమతుల్యం ఏర్పడి, 33 శాతానికి పచ్చదనం పెరిగి, ముఖ్య మంత్రి గారు ఆకాంక్షిస్తన్న హరిత తెలంగాణ మరియు హరిత భారత్ లక్ష్యం అనతి కాలంలోనే తప్పక నెరవేరుతుందన్నారు.

- Advertisement -