కాంగ్రెస్‌లో అగ్రకుల పెత్తనం…వీహెచ్‌ ఫైర్

473
v hanumantha rao
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ విధేయులకు కాంగ్రెస్ లో నష్టం జరుగుతుంది,నాయకులను పట్టించుకోవడం లేదన్నారు. .

17 ఏళ్ల నుంచి రాజీవ్ గాంధీ సద్భవన ర్యాలీ చేస్తూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ…క్రీడల్లో రాణించే యువతి యువకులకు ఆర్ధిక సహాయం చేస్తున్నాని చెప్పిన వీహెచ్‌ …తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తనపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ ఓడిపోయిన పార్టీలో చురుకుగా ఉంటున్నాను…రైతుల అరెస్టులు,నెరేళ్ల ఘటన లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటంలో ముందు ఉన్నానని చెప్పిన వీహెచ్‌…రాజీవ్ గాంధీ అనుచరులకు పార్టీలో గౌరవం దక్కడం లేదన్నారు.

తాను ఏం తప్పు చేశానో పార్టీ నాయకులు చెప్పాలని….పార్టీలో జరుగుతున్న పరిస్థితి పై సోనియాగాంధీ కి లేఖ రాశానని చెప్పారు.ఎన్నికల సమయంలో నియమించిన కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వలేదు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పోయిన నాయకులకు ఎంపీ టికెట్లు ఇచ్చారని ఆరోపించారు.

కొప్పుల రాజు అనే వ్యక్తి ఎందుకు వచ్చారో తెలియదు.పీసీసీ ప్రెసిడెంట్ కి కొప్పుల రాజు అంటే భయం.పొన్నాల లక్ష్మయ్యకు పీసీసీ పదవి ఇచ్చి ఇట్టే తీసేశారు.

బీసీలకు అన్యాయం జరుగుతుంది ఎవరికి చెప్పాలి,అగ్రకులాల పెత్తనం ఇంకా ఎన్ని రోజులని ప్రశ్నించారు.ఎమ్మెల్సీ సిటు విషయంలో పొంగులేటి సుధాకర్ రెడ్డిని ఏఐసీసీ సెక్రటరీ డబ్బులు అడిగారని అందుకే ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయారని చెప్పారు.బీసీలకు పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు వీహెచ్‌.

- Advertisement -