వివాదాస్పద టైటిల్‌తో షాకిచ్చిన వర్మ..!

523
- Advertisement -

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌ చెప్పుకునే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. ఈ డైరెక్టర్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. ఆయన ఏది చేసిన అది కాంట్రవర్సీని క్రియోట్‌ చేస్తుంది. ముఖ్యంగా వర్మ తీసే సినిమాలు టైటిల్‌ మొదలు సినిమా విడుదలయ్యే వరకు నిత్యం వివాదాల్లో నిలుస్తుంటాయి.

ఇక అసలు విషయానికొస్తే.. వర్మ మరో వివాదాస్పద చిత్రానికి తెర తీశాడు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్‌ సమయంలోనే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్‌తో సినిమాను తెరకెక్కించబోతున్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్ ప్రమోషన్‌ కోసమే వర్మ ఈ ప్రకటన చేసినట్టుగా భావించారు.

rgv

కానీ తాజా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్‌తో అభిమానులకు షాకిచ్చాడు వర్మ. అంతేకాదు కొత్త ఈ చిత్రం నుండి తొలి సాంగ్ ట్రయిలర్ రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్టు ట్విట్టర్‌లో ప్రకటించాడు.

ఈ చిత్రాన్ని మోస్ట్ నాన్ కాంట్రవర్శియల్ చిత్రంగా వర్మ పేర్కొనడం గమనార్హం. కాగా, ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్న వర్మ, అయితే ఈ సినిమకు సంబంధించిన షూటింగ్‌ అప్‌డేట్స్‌ మాత్రం బయటకు రాకుండా జాగ్రత్త పడున్నాడు వర్మ. మరి ఈ మూవీతో ఎలాంటి వివాదాలు తలెత్తుతాయో చూడాలి.

- Advertisement -