ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ముని మనవరాలి పెళ్లి…

437
Uyyalawada Narasimha Reddy
- Advertisement -

సిపాయిల తిరుగుబాటు కంటే ముందు బ్రిటిష్ సామ్రాజ్యావాదుల శక్తులను గజగజలాడించిన తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని రాంచరణ్ నిర్మింస్తున్నా విషయం తెలిసిందే.ఇక ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో అలరించనున్నారు.

అయితే అసలు విషయం ఏంటంటే..ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ముని మనుమరాలు సంజనరెడ్డి వివాహం జరిగింది. ఈమె వివాహం చెన్నై నగరానికి చెందిన ప్రతాప్‌రెడ్డితో హైదరాబాద్ జె.ఆర్.సి.కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు సంజనరెడ్డి తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి, సుచరితలు ఆహ్వానితులకు స్వాగతం పలికారు. ఈ వేడుకకు తమిళనాడు తెలుగు యువ శక్తి అధ్యక్షుడు, దక్షిణ భారత ఉయ్యాలవాడ సేవ సేన ,కన్వీనర్, సినీ నిర్మాత,దర్శకుడు అయిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, సినీ నటుడు సుమన్ హాజరయ్యారు.

Uyyalawada Narasimha Reddy

అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహా కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి అఖిలప్రియ ,పార్లమెంట్ సభ్యుడు జెసి దివాకరరెడ్డి,శాసనసభ్యులు ,సూర్యనారాయణ, బి.సి.జనార్ధనరెడ్డి ,రాజశేఖర్ రెడ్డి ,ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. శ్రీ రఘువీరారెడ్డిలతో పాటు వై.స్.ఆర్.సి.పి.కి చెందిన విశ్వేశ్వరరెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి ,కాటసాని రాంభూపాల్ రెడ్డిలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Uyyalawada Narasimha Reddy

ఉయ్యాలవాడ ముని మనవడు పెళ్లి కుమార్తె తండ్రి మాట్లాడుతూ.. “ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను గతంలో మేమే చలనచిత్రంగా నిర్మించాలనుకొన్నాము,అప్పట్లో ఈ విషయమై సుమన్‌ను సాయికుమార్‌ను కూడా సంప్రదించడం జరిగిందని ఉయ్యాలవాడ మెమోరియల్‌గా మా ప్రాంతంలో తీర్చిద్దేందుకు ఇప్పటికే వారి విగ్రహంను కూడా చేయించటం జరిగిందని, త్వరలో ఆ విగ్రహాప్రతిష్టా, మెమోరియల్ హాల్ నిర్మాణం ప్రారంభించనున్నట్లు తెలిపారు.

చిరంజీవి తనయుడు రాంచరణ్ సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ జీవితంను సినిమాగా తియ్యటం చాలా సంతోషం అని ముఖ్యంగా వాడ.. వాడల తిరిగి తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని జాతీయ వీరుడుగా గుర్తించాలని అన్ని రాష్ట్రాలలో తిరిగి సంతకాల సేకరణ కార్యక్రమంను చేప్పట్టిన దక్షిణ భారత ఉయ్యాలవాడ సేవ సేన ,కన్వీనర్ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ వివాహా మహోత్సవానికి విచ్చేసిన అతిరథమహారధులకు తన కృతజ్ఞతలను తెలిపారు.

- Advertisement -