‘సాహో’ నిర్మాతలకే ‘సైరా’

287
Syeera
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఇటివలే పూర్తీ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈమూవీ విడుదలపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం హక్కులు తీసుకోవడానికి భారీగా డిమాండ్ ఉంది. చిరంజీవి కావడంతో ఎంత రేటుకైనా నిర్మాతలు వెనకాడటం లేదు. బడా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు రైట్స్ కోసం పెద్ద మొత్తంలో చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు.

చివరగా ఈమూవీ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్ధ యూవీ క్రియేషన్స్ భారీ మొత్తం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ డిస్ట్రీబ్యూషన్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఇంకా నైజాంలో సైరా డిస్ట్రీబ్యూషన్ హక్కులు ఎవరు తీసుకున్నారనే దానిపై ఇంకా క్లారీటి రాలేదు. యూవీ క్రియేషన్స్ సంస్ధ వారు ప్రస్తుంతం ప్రభాస్ తో సాహో మూవీని నిర్మిస్తున్నారు.

భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూనే మరోవైపు డిస్ట్రీబ్యూషన్ వైపు దృష్టి పెట్టడం విశేషంగా చెప్పుకోవచ్చు.. ఆగస్ట్ 15న సాహో విడుదల కానుండగా…అక్టోబర్ 2న సైరా మూవీ విడుదల చేయనున్నారు. ఈసినిమాకు ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల బ్యానర్ పై నిర్మించారు.

- Advertisement -