Uttarakhand:సెలవులు కాదు రిటైర్మైంట్ తీసుకొండి..

45
- Advertisement -

ఒక రోజు సెలవు పెడితే వంద కరణాలు అడుగుతారు. అలాంటి ఒక ప్రభుత్వ టీచర్ వరుసగా ఆరు నెలలు సెలవు పెడితే..విద్యార్థుల భవిష్యత్‌ ఏమవుతుందని అనే సందేహం తలెత్తకమానదు. అయితే వారిని స్వచ్చంద విరమణ చేయాలని సూచించాలి. అవును మీరు చదివేది నిజం. ఉత్తరఖండ్‌ ప్రభుత్వం ఇక నుంచి వరుసగా ఆరునెలలు సెలవు పెడితే వారు రిటైర్‌మెంట్‌ ప్రకటించినట్టుగా పేర్కొంటామని ప్రభుత్వం తెలిపింది. ఇది విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి ధన్ సింగ్‌ రావత్‌ తెలిపారు.

ఆరు నెలలు అంతకు మించి ఎక్కువ కాలం పాఠశాలలకు రాని ఉపాద్యాయులను విధుల నుంచి తప్పిస్తున్నట్టు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు రాష్ట్రంలో ఇలాంటి వారి లిస్ట్‌ను కూడా తయారుచేయాలని అధికారులకు ఆదేశించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో దాదాపుగా 150మంది ఉపాధ్యాయులు ఉన్నట్టు అంచనా. వారందరితో పదవీ విరమణ చేయించాలని సర్కారు నిర్ణయించినట్లు జాతీయ మీడియా కథనం. జాబితా పూర్తైన తర్వాత వారికి రిటైర్మైంట్ ఇచ్చి…కొత్త నియామకాలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది.

Also Read: అమెజాన్‌: 40రోజులు.. చిన్నారులు సురక్షితం

కొండ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయుల్లో చాలా మంది విధులకు రావట్లేదు. రాకపోకలు ఇబ్బందిగా ఉన్నాయని చెబుతూ చాలా కాలం పాటు దీర్ఘకాల సెలవులు పెడుతున్నారని విద్యాశాఖ అధికారిక వర్గాలు తెలిపాయి. మరికొందరైతే జీతం లేని సెలవుల ఆప్షన్ కింద సంవత్సరాల తరబడి విధులకు గైర్హాజరవుతున్నట్లు వెల్లడించారు. అయితే ఇలాంటి సెలవులు తీసుకునే వారు స్వచ్ఛంద పదవీ విరమణ సదుపాయం ఉన్నప్పటికీ చాలా మంది రిటైర్మెంట్ తీసుకోకుండానే సెలవులను కొనసాగిస్తున్నారట. ఇది విద్యార్థుల భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read: KTR:ప్రజలందరికీ స్వపరిపాలనా ఫలాలు..

- Advertisement -