KTR:ప్రజలందరికీ స్వపరిపాలనా ఫలాలు..

37
- Advertisement -

దేశంలోనే అతి చిన్న వయసు ఉన్న రాష్ట్రం తెలంగాణ. స్వపరిపాలనా ఫలాలను ప్రజలకు సకాలంలో అందించడంలో తెలంగాణ ముందుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సుపరిపాలనా సౌరభాలను సమాజంలోని ప్రతి వర్గానికి తెలంగాణ ప్రభుత్వం సగర్వంగా అందిస్తుంది. తొమ్మిదేండ్ల తెలంగాణ ప్రస్థానంలో ప్రజలే కేంద్రంగా సాగిన సంస్కరణల పథం యావత్ భారతావనికే ఓ పరిపాలనా పాఠమని తెలిపారు. ప్రతి నిర్ణయం పారదర్శకమని ప్రతి మలుపులో జవాబుదారితనముందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

సీఎం కేసీఆర్‌ ఈ దశాబ్ద కాలంలో చేపట్టిన పాలనా సంస్కరణలు.. వచ్చే శతాబ్దికీ ఆచరించాల్సిన అడుగుజాడలని చెప్పారు. సంక్షేమ ఫలాలే కాదు, సంస్కరణల ఫలాలు కూడా ప్రజలందరికీ అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కి మాత్రమే సొంతమని పేర్కొన్నారు. మీకు పాలన చేతకాదు అని అన్నోళ్లే.. మన పాలనా సంస్కరణలు చూసి మనసారా మెచ్చుకుంటున్న అరుదైన తరుణం ఇదని, తమ గుండెలనిండా దీవిస్తున్న అపూర్వమైన సందర్భమని వెల్లడించారు. పంచాయతీరాజ్ శాఖలో తెచ్చిన సంస్కరణలు పల్లె సీమలకు ప్రగతి రథ చక్రాలుగా నిలిచాయన్నారు. మున్సిపల్ శాఖలో అవినీతి మురికిని కడిగిపారేసిన సంస్కరణల పథం దేశంలోనే సరికొత్త అధ్యాయమని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Also Read: CMKCR:దేశంలోనే నెంబర్‌ వన్ తెలంగాణ

శరవేగంగా పరుగులు పెడుతున్న మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఆధునిక సంస్కరణలే పునాదిరాళ్లని చెప్పారు. టీఎస్‌-ఐపాస్‌ విధానంతో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమని తెలిపారు. భూమి చుట్టూ అల్లుకున్న సవాలక్ష చిక్కుముళ్లను విప్పేందుకు ప్రజల కోసం ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ధరణి అని వెల్లడించారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ నుంచి నూతన కలెక్టరేట్ల నిర్మాణం వరకూ.. తండాలు, గ్రామపంచాయతీల నుంచి నూతన రెవెన్యూ డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల వరకూ.. తెలంగాణలో సాగిన ప్రతి సంస్కరణ పథం.. భవిష్యత్ తరాలకు వెలకట్టలేని ఆభరణమని తెలిపారు. బాబాసాహెబ్ చూపిన బాటలో మన తెలంగాణ.. మనం తెచ్చుకున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకూ భాగస్వాములైన ఉద్యోగులకు, యావత్ ప్రభుత్వ యంత్రాంగానికి.. సుపరిపాలన సైనికులందరికి పేరుపేరునా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: బీసీల్లోని వృత్తికులాలకు ఆర్థికసాయం..

- Advertisement -