ఆరు నెలల్లో ముగ్గురు సీఎంలు..!

109
utharakhand
- Advertisement -

ఉత్తరాఖండ్ బీజేపీలో రాజకీయ ముసలం కొనసాగుతూనే ఉంది. తాజాగా సీఎం తీరత్ సింగ్… గవర్నర్‌ని కలిసి తన రాజీనామాను సమర్పించారు. ఇవాళ జరిగే బీజేఎల్పీ భేటీలో కొత్త సీఎంను ఎన్నుకోనున్నారు. సత్పాల్ సింగ్, ధన్‌సింగ్ రావత్ పేర్లను బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

తీరత్‌సింగ్‌ రాజీనామాతో ఉత్తరాఖండ్‌లో ఆరు నెలల వ్యవధిలోనే ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. మార్చిలో ఉత్తరాఖండ్‌ బీజేపీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా త్రివేంద్ర సింగ్ రావత్‌ను సీఎం పీఠం నుంచి దించేసిన హైకమాండ్.. పౌరీ గర్వాల్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతోన్న తీరత్‌ను ముఖ్యమంత్రిని చేసింది.

ఆరు నెలల్లో ఆయన శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉండగా అది సాధ్యం కాలేదు. దీంతో మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన తీరత్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పలు దఫాల చర్చల తర్వాత రాజీనామాను సమర్పించారు.

రాజ్యాంగ అనివార్య‌త వ‌ల్లే తిరాత్ రావ‌త్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి వైదొలిగార‌ని, క‌రోనా మ‌హ‌మ్మారితో ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని బీజేపీ పేర్కొన‌డం అతిపెద్ద అబ‌ద్ధ‌మ‌ని కాంగ్రెస్ సీనియర్ నేత హ‌రీష్ రావ‌త్ మండిప‌డ్డారు.

- Advertisement -