కరోనా ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ మహమ్మారి కారణంగా 202 దేశాల ప్రజలు భయంతో వణికిపోతుండగా మెజార్టీ దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో తమకు పుట్టిన కొడుకుకు లాక్ డౌన్ అని, బిడ్డకు కరోనాఅనే పేరు పెట్టుకున్నారు. గోరఖ్‌పూర్‌లో పుట్టిన పసిబిడ్డకు కరోనా’ అని పేరు పెట్టాడు ఆ పాప మేనమామ నీతిష్ త్రిపాఠీ. పాపకు కరోనా పేరు పెట్టేందుకు తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నట్టు చెప్పాడు. కరోనా వైరస్ ప్రపంచాన్ని ఐక్యం చేసిందని నితీష్ అంటున్నాడు. మార్చి 22న జనతా కర్ఫ్యూ రోజునా పాప పుట్టిందని అందుకే పాపకు కరోనా పేరు పెట్టినట్లు వెల్లడించాడు.
దియోరియా జిల్లాలో ఖుకుందు గ్రామంలోని ఓ మహిళకు మార్చి 30వ తేదీన ఓ బాబు పుట్టాడు. ఆ పసిబిడ్డకు తల్లిదండ్రులు ‘లాక్ డౌన్’అని పేరు పెట్టారు. దేశ ప్రజల క్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న ‘లాక్ డౌన్’ పేరును మా బాబుకు పెట్టాం’ అని ఆ బాలుడి తండ్రి చెప్పారు. మొత్తంగా ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.