- Advertisement -
మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కోదాడలో 50 వేల మెజార్టీ రాకుంటే రాజకీయాలకు గుడ్ బై చెబుతానని ప్రకటించారు. కోదాడ మండలం కాపుగళ్లులో మంగళవారం జరిగిన కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి యాభై వేల మెజార్టీ కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయాల్ని వదిలేస్తాను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాల్ని మాఫీ చేస్తాం అన్నారు.
ఇది రైతు బంధుకంటే గొప్ప పథకం. భూమిలేని వ్యవసాయ కూలీలకు కూడా ఆర్థిక సాయం చేసేందుకోసం ఒక పథకం తీసుకొస్తాం. దీని ద్వారా ఏడాదికి రూ.12 వేలు అందిస్తాం. అభయహస్తం పింఛన్లను కూడా తిరిగి ప్రారంభిస్తాం అన్నారు.
- Advertisement -