ఉప్పు ఎక్కువగా వాడుతున్నారా!

44
- Advertisement -

ఉప్పు అనేది వంటింట్లో అత్యంత ముఖ్యమన నిత్యవసర వస్తువు. ఎలాంటి కూర చేసిన, ఎన్ని మసాలా దినుసులతో రుచికరమైన, అమోఘమైన వాసనగా వంటలు ఎన్ని చేసిన అందులో ఉప్పు కాస్త ఎక్కువైన లేదా తక్కువైన ఆ వంటల రుచే మారిపోతుంది. అందుకే ఉప్పు ఎంతో కీలకం. అయితే కొందరికి ఉప్పు కాస్త ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినే అలవాటు ఉంటుంది. అలాంటి వారు ఉప్పు తగినంత ఉన్నప్పటికి చప్పగా ఉందని చెబుతూ ఉంటారు. అయితే వంటల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటే ఆరోగ్యనిని ప్రమాదమే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎదుకంటే ఉప్పులో సోడియం శాతం ఎక్కువగా ఉంటుంది. .

దీని వల్ల మూత్ర పిండాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇంకా తినే ఆహారంలో ఉప్పు ఎక్కువైతే రక్తపోటుకు కూడా దారితీస్తుందట. తద్వారా హైపర్ టెన్షన్ కూడా ఏర్పడి గుండె పోటుకు కారణమయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఉప్పు ఎక్కువైన ఆహార పదార్థాలను తింటే డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఉప్పులో ఉండే సోడియం శరీరంలోని నీటిశాతాన్ని తగ్గిస్తుంది. తద్వారా అతిగా దాహం వేయడం, తలనొప్పి వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి.

ఇంకా జీర్ణ సమస్యలు కూడా ఏర్పడతాయట. కడుపులో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు రావడానికి తినే ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉండడం కూడా ఒక కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల తినే ఆహారంలో ఉప్పు శాతం తగినంతా ఉండేలా చూసుకోవాలట. అయితే మరి చప్పగా తినడం కూడా అంతా మంచిది కాదట.సోడియం తక్కువౌతుంది. నరాలను ఉత్తేజ పరచడం, రక్త ప్రసరణ, కండరాల సంకోచం.. వంటి పనులలో సోడియం ప్రధాన పాత్ర వహిస్తుంది. మన శరీరానికి అవసరమయ్యే సోడియం ఉప్పు నుంచే లబిస్తుంది. తద్వారా ఈ సోడియం ఎక్కువైన ప్రమాదమే, తక్కువైన ప్రమాదమే అందుకే తినే వంటలలో ఉప్పు తగినంతా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: KTR:పూలే బోధనలు అందరికీ ఆచరణీయం

- Advertisement -