టీఆర్ఎస్ ఎంపీ రాజ్యసభ సభ్యుడు ప్రారంభించిన తన మానసపుత్రికైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతుంది. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా, మరియు ఖండాంతారాలకు వ్యాప్తిచెందింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతున్నారు. నాటడంతోనే కాకుండా వాటిని సంరక్షించి భావితరాలకు మంచి ఆక్సిజన్, మంచి వాతావరణం అందించాలని సంకల్పం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆదేశాల మేరకు యూఎస్‌లోని డల్లాస్, టెక్సాస్‌లో ఇంటింటికి ఒక మొక్క చొప్పున పంచారు. డల్లాస్ విధుల్లోని పలు ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సభ్యులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రకృతి మన దైవమన్నారు. దీనిని భావితరాలకు అందించేందుకు మనవంతు సాయం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంటర్‌నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ మహిళా విభాగం అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మీ, తెలంగాణ స్టేట్ వీపీ చందా సుధాకార్, వరంగల్ జిల్లా ట్రెజరర్ ఎలగందుల రాజేంద్రప్రసాద్, వరంగల్ మహిళా విభాగం ట్రెజరర్ ఎలగందుల అరుణ, అభిషేక్, కొత్తూర్ యూత్ ఆర్గనైజేషన్ లీడర్ పలువురు ఎన్నారైలు పాల్గొని మొక్కలు నాటి వాటి సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఇవి కూడా చదవండి…