- Advertisement -
యుఎస్‌లో విషాదం చోటుచేసుకుంది. వర్జీనియాలో ఓ దుండగుడు ప్రజలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈఘటనలో 12 మంది మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భవన సముదాయంలోకి తుపాకీతో ప్రవేశించిన దుండగుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. దుండగుడి కాల్పుల్లో పోలీసు అధికారి కూడా గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దుండగుడిని మట్టుబెట్టారు.
ఈ దారుణానికి అతడు ఎందుకు పాల్పడ్డాడో తెలియలేదని, దీనిపై విచారణ జరుపుతున్నామని వర్జీనియా పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
- Advertisement -