జగన్ కేబినెట్‌…. వీరికి చోటు ఖాయమేనా?

282
jagan roja

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు జగన్‌. ఇక త్వరలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానుండటంతో మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్‌ 8న కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారు కాగా మంత్రివర్గ కూర్పుపై జగన్‌ తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

పార్టీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో వీరిలో చాలామంది మంత్రి పదవులను ఆశీస్తున్నారు. తొలి నుంచి జగన్ వెంట నడిచిన వారు తమకు మంత్రి పదవి ఖాయమనే ధీమాలో ఉన్నారు. దీనికి తోడు ఎన్నికల ప్రచారంలో పలువురికి మంత్రిపదవులపై హామీ ఇచ్చారు జగన్‌. ఈ నేపథ్యంలో కేబినెట్ కూర్పు ఎలా ఉండనుందనే దానిపై పుకార్లు షికార్ చేస్తున్నాయి.

మంత్రిపదవికి వీరికి ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఆళ్ల రామకృష్ణా రెడ్డి,గ్రంథి శ్రీనివాస్‌ లకు మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. వీరితో పాటు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద రావు, ఆనం రామనారాయణ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, అనంత వెంకట్రామిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబు, రోజా,కొడాలి నానిలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.