తెగ తాగేస్తున్నారు..బీర్లు నో స్టాక్‌ !

206
beers

అసలే ఎండాకాలం బయట సూర్యుడు దంచికోడుతున్నాడు. ఎం డ ప్రచడమవుతుండడంతో భానుడి ప్రతాపాన్ని తీర్చు కోవడానికి ప్రతిఒక్కరూ చల్లని పానీయాల వైపు మొ గ్గుచూపుతున్నారు. మందుప్రియులు మాత్రం దాహాన్ని తీర్చుకోవడానికి ఎక్కువగా చల్లని బీర్లను కొనుగోలు చేస్తున్నారు. మండే ఎండలకు బాడీని కూల్ చేసుకోవాలని వైన్స్ షాపుల ముందు క్యూ కడుతున్నారు. అందుకే సమ్మర్‌లో బీర్ల అమ్మకాలు అదిరిపోతున్నాయి. బాటిళ్లకు బాటిళ్లు… కేసులకు కేసులు ఖాళీ అయిపోతున్నాయి.

తాగేవాళ్లు ఎక్కువయ్యారు కానీ వాళ్ళకి సరిపడే బీర్లు దొరకడం లేదట .. నో బీర్స్ , స్టాక్ ఇస్ ఓవర్ అన్నా బోర్డులను తగిలిస్తున్నారు వైన్స్ షాపుల యజమానులు.మందు తప్ప కొన్ని చోట్ల బీర్లు దొరకడం లేదట .ఎండాకాలం కాబట్టి నీళ్ళు లేకా బీర్లు తయారీ తగ్గిందని తయారీ సంస్థ యాజమాన్యం చెబుతుంది ..

మే నెలలో బీర్ల అమ్మకాలు రికార్డులు సృష్టించాయి. నువ్వానేనా అంటూ మండే ఎండలతో.. బీర్లు పోటీపడుతున్నాయి. రాష్ట్రంలో పాత రికార్డులను తిరగరాస్తూ.. బీర్ల అమ్మకాలు జోరందుకున్నాయి.ఎక్సైజ్ శాఖ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేనంతగా 40 లక్షలకు పైగా బీర్ కేస్‌లను అమ్మేశారు.