కరోనా చికిత్సకు 8 కోట్ల బిల్లు..!

358
Corona Survivor
- Advertisement -

కరోనా మహమ్మారికి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దీని దాటికి పేదవాళ్లే కాదు కోటీర్వరులు కూడా బెంబేలేత్తిపోతున్నారు. ఇక కరోనా సోకిన వ్యక్తి వైద్యానికి ప్రైవేటు ఆసుపత్రులు బారీగానే వసులు చేస్తున్నాయి. తాజాగా అమెరికాలో ఓ వ్యక్తికి కరోనా చికిత్సకు అయిన బిల్లు చూస్తే షాక్‌ అవుతారు. ఆ పేషెంట్‌కు కరోనా వైరస్ తగ్గించడానికి హాస్పటల్ వేసిన బిల్లు చూసి హార్ట్ ఎటాక్ వచ్చినంత పనయింది. అమెరికాకు చెందిన మిచ్చెల్‌ ఫ్లోర్‌ అనే వృద్ధుడు.. కరోనాతో మార్చి 4న ఆస్పత్రిలో చేరాడు. అతను ఒకానొక దశలో.. చనిపోతాడని నర్సులు భావించారు. దీంతో వృద్ధుడి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి అతనితో మాట్లాడించారు. కానీ మొత్తానికి మిచ్చెల్‌ కరోనా నుంచి కోలుకుని మే 5వ తేదీన డిశ్చార్జి అయ్యాడు.

అయితే ఆ వృద్దుడికి వైద్యం అందించినందుకు ఏకంగా రూ. 8 కోట్ల బిల్లు(1.1 మిలియన్‌ డాలర్లు) వేశారు. ఈ బిల్లును చూసి వృద్ధుడితో పాటు ఆయన కుటుంబ సభ్యులు షాక్‌ అయ్యారు. అయితే అతడికి మెడికేర్ ఉడడంతో నిచ్చింతగా ఉన్నాడు. మెడీకేర్ అంటే ఏంటనేగా మీ సందేహం.. అది వృద్ధుల కోసం అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన ఇన్సూరెన్స్ ప్రోగ్రాం. దీని వల్ల ఆ వృద్దుడు జేబులో నుంచి డాలర్ కూడా తీయాల్సిన పనిలేకుండా హాయిగా ఇంటికి వెళ్లిపోయాడు.

- Advertisement -