ఉప్పెన ఫస్ట్ డే వసూళ్లు ఎంతో తెలుసా..?

243
uppena
- Advertisement -

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన ప్రేమకథా చిత్రం “ఉప్పెన”. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ కాగా రిలీజ్ తర్వాత కూడా సునామీ సృష్టించింది ఉప్పెన.

తొలిరోజు నైజాం, తెలంగాణలలో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 10.42 కోట్ల షేర్ రాబట్టింది ఉప్పెన. ఏరియా వారీగా లెక్కలు చూస్తే నైజాం.. రూ.3. 08 కోట్లు, వైజాగ్ రూ. 1. 43 కోట్లు, ఈస్ట్ రూ. 0.98 కోట్లు, వెస్ట్ రూ. 0.81 కోట్లు, క్రిష్ణా రూ. 0.62 కోట్లు, గుంటూరు రూ. 0.65 కోట్లు, నెల్లూరు రూ. 0.35, టోటల్ ఆంధ్రా రూ. 4. 87 కోట్లు, సీడెడ్ రూ. 1. 35 కోట్లు, నైజాం+ ఏపీ రూ. 9.3 కోట్లు రాబట్టాయి.

మిగతా రెండు మూడు రోజుల్లోనే ‘ఉప్పెన’ బ్రేక్ ఈవెన్ సాధించి నిర్మాతలను లాభాల బాట పట్టించడం ఖాయంగానే కనిపిస్తోంది.శని-ఆదివారాలు రావడంతో పాటు వాలెంటైన్స్ డే కూడా ఉండటంతో ప్రేమికులు ఉప్పెన చిత్రానికి క్యూ కట్టే అవకాశం ఉంది.

- Advertisement -