రాష్ట్రంలో రెండో డోస్ వ్యాక్సినేషన్..

132
covid 19
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ్టీ నుండి రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తొలి డోసు తీసుకున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌ వైద్య ఆరోగ్య సిబ్బందికి రెండో డోస్‌ టీకా ఇస్తున్నారు.

రాష్ట్రంలో 140 కేంద్రాల్లో టీకా పంపిణీ కొనసాగుతుండగా గాంధీ హాస్పిటల్‌ డీఎంఈ రమేశ్‌రెడ్డి , టిమ్స్‌ డైరెక్టర్‌ విమలా థామస్‌కు వ్యాక్సిన్‌ ఇచ్చారు. తెలంగాణలో మార్చి రెండోవారం నుంచి సాధారణ ప్రజలకు వ్యాక్సిన్ ను అందించనున్నట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ తెలియజేసింది. ముందుగా 50 ఏళ్ళు పైబడిన వారికి వ్యాక్సిన్ ను అందించనున్నారు. ఆ తరువాత మిగతా వారికి వ్యాక్సిన్ అందిస్తారు.

గత నెల 16న కొవిడ్‌ తొలి డోస్‌ వ్యాక్సినేషనేషన్‌ డ్రైవ్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి డోస్‌ తీసుకున్న చోటే రెండో డోస్‌ వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అ మొదటి డోస్‌ తీసుకోని సిబ్బంది ఈ నెల 25లోగా తీసుకోవాలని అధికారులు సూచించారు.

- Advertisement -