వంద కోట్ల గ్రాస్‌లో ‘ఉప్పెన’..

57
uppena movie

వైష్ణవ్ తేజ్ హీరోగా.. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన చిత్రం ఇటీవల విడుదలైన భారీ విజయాన్ని సోంత చేసుకుంది. ఈ మూవీ తొలి రోజు నుండే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ళ రాబ‌డుతూ అంద‌రు అవాక్క‌య్యేలా చేసింది. నాలుగైదు రోజుల‌లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను క్రాస్ చేసి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

సినిమాకు లభిస్తున్న ఆదరణను చూసి.. ‘ఇది 100 కోట్ల సినిమా’ అంటూ మొదటి రోజే కొందరు జోస్యం చెప్పారు. అనుకున్నట్టుగానే ఇప్పుడది నిజమైంది. తమ సినిమా 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. ‘ఉప్పెనంత మీ ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ ఓ పోస్టర్ ను కూడా సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది.

ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషించగా.. కృతి శెట్టి కథానాయికగా తెలుగుతెరకు పరిచయమైంది. ఇక సినిమా విడుదల కాగానే, సూపర్ హిట్ అన్న టాక్ ఏకగ్రీవంగా వచ్చేసింది. ప్రేమకథల్లో ఒక సంచలనంగా నిలిచింది. దేవి శ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం కూడా సినిమా స‌క్సెస్‌లో భాగ‌మైంది.