తారామతి బారాదారి టుంబ్స్‌ను సందర్శించిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా

238
Uppala Srinivas Gupta
- Advertisement -

తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గురువారం తారామతి బారాదారి టుంబ్స్‌ను సందర్శించారు. ఈ సంద‌ర్భంగా టుంబ్స్ లోని 1600 సీటింగ్ కెపాసిటీ ఓపెన్ హాల్ తోపాటు ఇతర హాల్స్‌, ఆడిటోరియంలను ఆయ‌న పరిశీలించారు. టూరిజంశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రెస్టారెంట్‌లోని ఆహార పదార్థాల నాణ్యతను చెక్ చేశారు. టుంబ్స్ చుట్టూ నాటిన మొక్క‌ల‌ను సంరక్షించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో చైర్మన్‌తో పాటు సూపర్ వైజర్లు రవీందర్ రెడ్డి, శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -