కేసీఆర్, కేటీఆర్‌కు ధన్యవాదాలు- ఉప్పల శ్రీనివాస్ గుప్త

314
Uppala Srinivas Gupta
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) 10 శాతం రిజర్వేషన్లు తీసుకురావడం ఎంతో సంతోషించే విషయమని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేయడంపై ఆయన సీఎం కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అపర భగీరథుడులా పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. కేసీఆర్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు.

కేసీఆర్ తీసుకొచ్చిన ఈ రిజర్వేషన్ల వల్ల రాష్ట్రంలోని ఆర్యవైశ్యులతో పాటు రెడ్డి సామాజిక వర్గం, వెలమ, క్షత్రియ, బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ కులాల్లో ఉన్న పేద విద్యార్థులందరికీ కాలేజీలలో సీట్లలో, ఉద్యోగాలలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ రిజర్వేషన్లు తెచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు తెలంగాణలో ఉన్న ఆర్యవైశ్యులందరి తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

- Advertisement -