సీజనల్ వ్యాధుల నివారణ కోసం పురపాలక శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం “ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు” కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా.
మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా తన ఇంటి ఆవరణలో పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రానున్న వర్షాకాలం నాటికి దోమల వలన కలిగే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల నివారణ కోసం ఇప్పటి నుంచే ప్రజలు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇంత గొప్పకార్యక్రమం చేపట్టిన మంత్రి కేటీఆర్‌ని అభినందించారు.
ఇక ఇప్పటికే ఉప్పల ఫౌండేషన్ ద్వారా కరోనా లాక్ డౌన్ సమయంలో పేదలకు సాయం అందించారు ఉప్పల శ్రీనివాస్. తెలంగాణలోని 33 జిల్లాల్లో ఐంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తరపున జీహెచ్ఎంసీ పరిధిలో ఉప్పల ఫౌండేషన్ తరపున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.