వైరల్ : బేబీ బంప్ తో ఉపాసన

69
- Advertisement -

మెగా కోడలు, కామినేని ఇంటి ఆడపడుచు ‘ఉపాసన’ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. మెగా అభిమానులు ఈ శుభవార్త కోసం పదేళ్లుగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఉపాసన బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉపాసన కజిన్ వెడ్డింగ్ కోసం చరణ్ దంపతులు థాయ్ లాండ్ కు వెళ్లారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలలో ఉపాసన బేబీ బంప్ తో కనిపిస్తోంది. ఈ పిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ ఫోటో చూసి మెగా ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. త్వరలోనే మెగాస్టార్ గ్రాండ్ సన్ వచ్చేస్తున్నాడంటూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తూ క్రేజీ పోస్ట్ లు పెడుతున్నారు. మెగా వారసుడు రాక ఇక త్వరలోనే అంటూ ఒక నెటిజన్ పోస్ట్ పెట్టగా.. మెగాస్టార్ గ్రాండ్ చైల్డ్ కమింగ్ సూన్ వావ్’ అంటూ మరో నెటిజన్ పోస్ట్ పెట్టాడు. మొత్తానికి మెగా నెటిజన్లు నెట్టింట సందడి చేస్తున్నారు. 2012లో చరణ్, ఉపాసన వివాహం జరిగింది. పదేళ్ల తర్వాత ఈ జంట బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇక వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలిగా ఉన్న ఉపాసన అటు బిజినెస్ లోనూ దూసుకువెళ్తున్నారు. ప్రస్తుతం ఉపాసన అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపడుతున్నారు. అదే విధంగా బి పాజిటివ్ హెల్త్ అండ్ ఫ్యాషన్ మ్యాగజైన్ స్థాపించి సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నారు. మొత్తానికి ఉపాసన గోల్డెన్ స్పూన్ తో పుట్టినప్పటికీ లైఫ్ ని ఛాలెంజింగ్ గా మలచుకున్నారు.

ఇవి కూడా చదవండి…

ఛాన్స్ లు కోసమే ఎక్స్ పోజింగ్

వాల్తేరు వీరయ్య మెయిన్ ట్విస్ట్ అదే

- Advertisement -