మోడీ సర్కార్..అంత బలహీనంగా ఉందా?

57
- Advertisement -

ఇటీవల భారత్ చైనా మద్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో భారత్ చైనా సైన్యాలు ఘర్షణలకు పాల్పడ్డాయి. అయితే ఈ ఘర్షణలలో ఇరు దేశాల సైన్యంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, సైనికులు మాత్రం గాయపడ్డారని ఇరు దేశాలు కూడా ప్రకటించుకున్నాయి. కాగా గత కొన్నేళ్లుగా భారత్ చైనా మద్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లో 90,000 చ.కి. మీ భూమి తమదేనని చైనా ఆరోపిస్తుండగా, కాదు కాదు.. పశ్చిమాన అక్సాయ్ చిన్ లో 38,000 చ.కి.మీ భూభాగాన్ని చైనా ఆక్రమించిందంటూ భారత్ ఆరోపిస్తుంది.

ఇలా ఇరు దేశాల మద్య ఎప్పటికప్పుడు సరిహద్దు వివాదం చెలరేగుతూనే ఉంది. అయితే చైనా దురాక్రమణను భారత్ తిప్పికొట్టడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. చైనా బలగాలను తిప్పికొట్టే సామర్థ్యం భారత సైన్యానికి ఉన్నప్పటికి మోడీ సర్కార్ మాత్రం అనుమతి ఇవ్వడంలో వెనుకడుగు వేస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కానీ కమలనాథులు మాత్రం మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత భారత్ లో ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా కోల్పోలేదని చెబుతున్నారు. ఇక అమద్య భారత్ భూభాగమైన సిక్కిం డోక్లాం ప్రాంతంలో చైనా అక్రమంగా రోడ్డు నిర్మాణం.. అలాగే కట్టడాలు చేపట్టగా ఆ వివాదం కొన్ని రోజులు సాగింది. ఇలా అడపా దడపా సరిహద్దు ప్రాంతాల్లో చైనా భారత్ మద్య తరచూ అగ్గి రాజుకుంటూనే ఉంది.

అయినప్పటికి ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం దిశగా కేంద్రం ఎందుకు ఆలోచించడం లేదనే ప్రశ్నలు వ్యక్తమౌతున్నాయి. ఇదే విషయాన్ని తాజాగా ఏంఐఏం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇదే విషయంపై మోడి సర్కార్ ను ప్రశ్నించారు. అరుణాచాల్ ప్రదేశ్ టైవాంగ్ సెక్టార్ లో భారత్ చైనా మద్య వివాదానికి సంబంధించి పార్లమెంట్ లో చర్చకు కేంద్రం ఎందుకు వెనుకడుగు వేస్తోందని నిలదీశారు. సరిహద్దుల్లో భారత సైన్యం బలంగా ఉన్నప్పటికి వారికి మద్దతుగా నిలవడంలో కేంద్రం బలహీనంగా ఉందంటూ విమర్శలు గుప్పించారు. చైనా సైన్యం భారత భూభాగంలోకి చొరబడినప్పటికి.. ఎవరు రాలేదంటూ దేశ ప్రజలను మోడి తప్పుదోవ పట్టిస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఇంకా పలువురు నేతలు కూడా ఇదే విధంగా స్పందిస్తున్నారు. మరి ఎలాంటి చొరబాట్లు జరగలేదని మోడి సర్కార్ ఎందుకు చెబుతోందో మోడీకే తెలియాలి అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

సత్ఫలితాన్నిస్తున్న… ‘రైతుబంధు’

కేంద్ర మంత్రిపై కే‌టి‌ఆర్ ఫైర్ !

బీఆర్ఎస్ ఆవిర్భావం..రైతులకు ఉషోదయం

- Advertisement -