NBK:అన్‌స్టాపబుల్‌..దేశంలో నెంబర్ వన్ టాక్ షో

9
- Advertisement -

 ఆహా OTT ప్లాట్‌ఫారమ్, ఎన్‌బికె మోస్ట్ ఎవైటెడ్ అన్‌స్టాపబుల్ సీజన్‌ 4 ను శనివారం అనౌన్స్ చేసింది. మునుపెన్నడూ చూడని సూపర్ హీరో పాత్రలో లెజెండరీ, షో హోస్ట్ నందమూరి బాలకృష్ణను ప్రజెంట్ చేసే అద్భుతమైన ఫస్ట్ లుక్, 3D యానిమేటెడ్ ప్రోమోని లాంచ్ చేసింది.

రతన్ టాటాకు నివాళులర్పిస్తూ ఒక క్షణం మౌనం పాటించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. అల్లు అరవింద్ (ఆహా డైరెక్టర్), అనిల్ రావిపూడి (డైరెక్టర్), తేజస్విని నందమూరి (అన్‌స్టాపబుల్ క్రియేటివ్ ప్రొడ్యూసర్), అజిత్ ఠాకూర్ (ఆహా డైరెక్టర్), రవికాంత్ సబ్నవిస్ (ఆహా CEO), రాజీవ్ చిలక (గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్) సహా పలువురు ప్రముఖులు ఈవెంట్ లో పాల్గొన్నారు.

అతిధులు NBK అద్భుతమైన 50 సంవత్సరాల లెగసీని, సినిమాలు చేయడంలో NBK వినూత్న విధానాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ NBK జర్నీలోని విశేషాలు పంచుకున్నారు. బాలకృష్ణ నిజజీవితంలోని సూపర్‌హీరో లక్షణాలను, అభిమానులతో కనెక్ట్ అయ్యే అంశాలని వెల్లడించారు.

అనంతరం తేజస్విని తన తండ్రి NBKని కొత్త సీజన్ ప్రోమోను లాంచ్ చేయడానికి ఆహ్వానించారు. తమ జీవితాల్లో వెలుగులు నింపగల సూపర్‌హీరో కోసం గ్రామస్తులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు ట్రైలర్‌ ప్రారంభమైయింది. డ్రామటిక్ ట్విస్ట్‌లో, పవర్, చరిష్మాటిక్ ప్రజెన్స్ తో సూపర్‌హీరోగా బాలకృష్ణ సీన్ లో ఎంటరవ్వడం అదిరిపోయింది. “బాలయ్య పండుగ” అనే వేడుకతో ఎండ్ అయిన ట్రైలర్ అందరినీ కట్టిపడేసింది.

ఈ గ్రాండ్ ఈవెంట్‌కు హాజరైన వారు అద్భుతమైన సీజన్ 4 ప్రోమో, ప్రత్యేక ఫస్ట్ లుక్‌ని ఆస్వాదించారు. ట్రైలర్ లో NBK సూపర్ హీరో క్యారెక్టర్ లో అదరగొట్టారు. ట్రైలర్ కి జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం ఆకట్టుకుంది.

ట్రైలర్ లాంచ్ సందర్భంగా నటసింహం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ..అందరికీ దసరా శుభాకాంక్షలు. గెలుపు అన్నది మన చేతుల్లోనే ఉంది. ఏదైతే కొత్తగా అనుకుంటామో ఆ జయం మనల్ని వరిస్తుంది. విజయానికి ప్రతీక ఈ దసరా శరన్నవరాత్రులు. అన్‌స్టాపబుల్‌ మొదలవడమే ఒక విస్పోటనం. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నాకు కేవలం తండ్రి గానే కాకుండా గురువుగా దైవంగా భావిస్తాను. ఆయన ఎంతో ముందు చూపుతో వినూత్నమైన చిత్రాలు, అద్భుతమైన పాత్రలు చేశారు. ఆయన స్ఫూర్తి తోనే అన్‌స్టాపబుల్‌ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ షో కూడా వేరే ఎవరైనా అడిగి ఉంటే చేసేవాడిని కాదు. కేవలం అరవింద్‌గారి కోసమే ఒప్పుకొన్నా. అన్‌స్టాపబుల్‌ అండ్ టీమ్ అంతా ఒక కుటుంబ సభ్యులులా పనిచేస్తూ కష్టపడ్డాం. ఆ కష్టానికి ఫలితమే అన్‌స్టాపబుల్‌ సక్సెస్. ఐఎండీబీ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో ఈ షో 18వ స్థానంలో వుంది. మన దేశంలోనే రీజినల్ లాంగ్వేజ్ లో నెంబర్ వన్ షోగా నిలిచింది. ఎంతో మంది హీరోలు, దర్శకులు, ప్రొడ్యూసర్లు మొదటి మూడు సీజన్ కి రావడం జరిగింది. వాళ్ళ మనసుల్లో మాటని ఎంతో ఓపెన్ గా పంచుకున్నారు. ఈ షో విజయంలో వారి పాత్ర వుంది. ప్రేక్షకులు ఏది కొత్తగా అనిపించినా దానికి ఆమోదం ముద్ర వేస్తారు. దాన్ని సక్సెస్ చేస్తారు. తెలుగు ప్రజలే కాకుండా యావత్ భారతదేశం ఈ షోకి నీరాజనాలు అందించింది. ఈ సందర్భంగా ప్రేక్షక దేవుళ్లకు, అన్ స్టాపబుల్ టీమ్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా చిన్న కూతురు తేజస్విని క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ఈ షోలో భాగం కావడం, స్క్రిప్ట్ రైటర్ రవి మచ్చ గారు, అలాగే టీం అంతా కూడా ఒక ఫ్యామిలీలా అహర్నిశలు కష్టపడ్డారు. ఎన్నో సినిమాలు కామిక్స్‌ రూపంలో వచ్చాయి. ‘అన్‌స్టాపబుల్‌’ మూడు సీజన్లు సక్సెస్‌ అయ్యాయి. అందుకే సీజన్‌-4 కొత్తగా అందించాలన్న ఉద్దేశంతో యానిమేషన్‌ రూపంలో ట్రైలర్‌ తీసుకొచ్చారు. రాజీవ్ అండ్ టీం చాలా అద్భుతంగా రూపొందించారు. సీజన్ 4 చాలా అద్భుతంగా వస్తుంది. ఎంత బాగుంటుందో ముందు ముందు మీరే చూస్తారు. అందరికీ కృతజ్ఞతలు’ తెలిపారు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఏ షో అయినా ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత హిట్ అవుతుంది. బాలయ్య బాబు టాక్ షో ప్రోమో తోనే బ్లాక్ బస్టర్ అవుతుంది. దట్ ఇజ్ బాలయ్య బాబు. ప్రోమో చూసిన తర్వాత ఒకటి అర్థమైంది. బాలయ్య బాబు గారు యానిమేషన్ తో కూడా గూస్ బంప్స్ తెప్పించగలరు. కొన్ని షాట్ చూస్తున్నప్పుడు చాలా కిక్కు వచ్చింది. ఆహా టీము ప్రత్యేకంగా బాలయ్య బాబు పండగ అని ఒక పండుగను క్రియేట్ చేశారు. బాలయ్య బాబు పండుగ అంటే అన్ స్టాపబుల్. బాలయ్య బాబు గారు ఈసారి కూడా అంతే ఎంటర్టైన్మెంట్ తో రాబోతున్నారని అర్థమైంది. ఆఫ్ స్క్రీన్ బాలయ్య బాబు గారి సెన్సాఫ్ హీరో, కామెడీ టైమింగ్, ఎనర్జీ అద్భుతం. ఆయన చాలా అడ్వాన్స్ గా ఉంటారు. చాలా ముందు ఆలోచిస్తారు. దాని ఫలితమే అన్ స్టాపబుల్. బాలయ్య బాబు తో భగవంత్ కేసరి సినిమా చేసే అదృష్టం దొరికింది, ఆ సినిమాకి అవార్డులు కూడా ఆనందంగా వుంది. ఆయనతో ఈరోజు ఈ స్టేజ్ ని షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అన్ స్టాపబుల్ సీజన్4 డబల్ హ్యాట్రిక్ తోస్టార్ట్ అవుతోంది. గన్ షాట్ బ్లాక్ బస్టర్ టీమ్.టీం అందరికీ కంగ్రాజులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్’ అన్నారు.

నిర్మాత, ఆహా డైరెక్టర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ.. అందరికీ దసరా శుభాకాంక్షలు. అన్‌స్టాపబుల్‌ బిగ్గెస్ట్ షో ఇన్ ఇండియా. ఐఎండిబి లో నైన్ అవుట్ ఆఫ్ టెన్ రేటింగ్స్ ఈ ఒక్క షోకే ఉన్నాయి. అటువంటి టాక్ షో మా ఆహా కి రావడం మా అదృష్టం. ఇంత సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ టాక్ షో మా బాలయ్య భుజాల మీద పెట్టాం. ఆయన తీసుకెళ్లి అంత ఎత్తులో పెట్టారు. ఈ మూడు సీజన్లో సీఎంలు, డిప్యూటీ సీఎంలు పెద్దపెద్ద హీరోలు ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చారు. నాలుగో మరింత కొత్తగా వుతుంది, ఎంత అద్భుతంగా వుంటుందో మీరు చూస్తారు’ అన్నారు.

Also Read:BB4: బాలయ్య – బోయపాటి నాలుగోసారి

నందమూరి తేజస్వినీ మాట్లాడుతూ.. ‘నాన్నగారు మొదటిసారి ఈ షో చేస్తున్నప్పుడు ‘ఆయన ఇమేజ్ కి షూట్ అవుతుందా? లేదా’ అని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన ధైర్యంగా ముందుకు వచ్చి చేశారు. ఆ ధైర్యమే షో ని ఈ స్టేజ్ కి తీసుకొచ్చింది. ఇండియాలో మోస్ట్‌ పాపులర్‌ షో అయింది. నాన్నగారిలో ఎవరూ చూడని సైడ్‌ చూశారు. నాన్నగారు చేయని జానర్‌ లేదు. వేయని గెటప్‌ లేదు. అంతేకాదు, ఫ్యామిలీ, స్నేహితులకు ఎప్పుడూ అండగా వుంటారు. హిందూపురం హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే. నిత్యం నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి కృషి చేస్తారు. బసవతారకం క్యాన్సర్‌ హాస్పటల్‌కు వెళ్తే అక్కడున్న పేషెంట్లు ‘ఇది హాస్పిటల్ కాదు.. దేవాలయం అమ్మా’ అంటారు. అన్ స్టాపబుల్ మూడు సీజన్ లు సూపర్ సక్సెస్ అయ్యాయి. సీజన్‌-4 ఏం చేస్తారా? అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇది అన్ ప్రిడక్ట్ బుల్ గా ఉంటుంది. ఇప్పటికే కొని ఎపిసోడ్స్ షూట్ చేశాం. సీజన్ 4 అద్భుతంగా వుంటుంది’ అన్నారు.

గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు రాజీవ్ చిలక మాట్లాడుతూ… నందమూరి బాలకృష్ణగారి కోసం 3డి ప్రోమో రూపొందించాలని మూడు వారాల క్రితం ఆహా టీమ్ నన్ను సంప్రదించింది, ఈ ప్రాజెక్ట్ గురించి చాలా ఎగ్జైట్‌గా ఉన్నాం, ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ అవకాశం ఇచ్చిన ఆహా టీంకి ధన్యవాదాలు.”మ్యూజిక్ కంపోజర్ జేక్స్ బిజోయ్ యానిమేషన్ ప్రోమోకు సంగీతం అందించడం పట్ల తన ఆనందం వ్యక్తం చేస్తూ, “నందమూరి బాలకృష్ణ గారికి బిగ్ ఫ్యాన్ ని. ఈ ప్రాజెక్ట్‌కు పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఇందులో భాగం కావడానికి నన్ను ఆహ్వానించినందుకు ఆహా టీమ్‌కి ధన్యవాదాలు” తెలిపారు.ఈ ఈవెంట్ ఎక్సయిటింగ్ సీజన్ 4కి స్టేజ్ ని సెట్ చేసింది. ఈ షో ప్రత్యేకంగా ఆహా OTTలో అందుబాటులో ఉంటుంది. ఎంటర్ టైన్మెంట్, సర్ ప్రైజ్ లతో నిండిన స్పెషల్ సీజన్ కోసం ఫ్యాన్స్ గెట్ రెడీ.

- Advertisement -