అన్‌లాక్ 5: థియేటర్లలకు అనుమతి..

152
Unlock5
- Advertisement -

బుధవారం నాడు కేంద్ర హోంశాఖ అన్‌లాక్-5 నిబంధనలు విడుదల చేసింది. వీటి ప్రకారం రేపటి నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు, ఎగ్జిబిషన్ హాల్‌లు, ఎంటర్టైన్మెంట్ పార్కులు, స్విమ్మింగ్‌పూల్‌లను తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. కొత్త నిబంధనల ప్రకారం విద్యా సంస్థలను అక్టోబర్ 15 నుండి తిరిగి తెరుస్తారు. ఇందులో భాగంగా అక్టోబర్‌ 31 వరకు కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఇక 50 శాతం సీట్ల సామర్థ్యంలో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతి కల్పించింది. మరోవైపు క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే స్విమ్మింగ్‌ పూల్‌లకు కూడా నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చింది కేంద్రం.

అలాగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాఠశాలల పునఃప్రారంభానికి వెసులుబాటు కల్పించింది కేంద్రం. అక్టోబర్‌ 15 తర్వాత ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి దశలవారీగా పాఠశాలల పునఃప్రారంభానికి అనుమతి ఇచ్చింది. సంబంధిత విద్యాసంస్థలు, పాఠశాలల యాజమాన్యాలతో చర్చల తర్వాత నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఆన్‌లైన్‌ బోధన విధానం, దూరవిద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం. ఆన్‌లైన తరగతులకు విద్యార్థులు మొగ్గు చూపితే పాఠశాలలు అనుమతించవచ్చు.. ఇందుకు తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతితోనే పాఠశాలల్లోకి విద్యార్థుల ప్రవేశం ఉంటుంది.

పాఠశాలల పునఃప్రారంభంపై ఆయా రాష్ఠ్రాలు భద్రతా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రం ఈ మేరకు సూచించింది. కేంద్ర పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలకు అనుబంధంగా భద్రతా నిబంధనలు ఉండాలని కోరింది. పునఃప్రారంభించే పాఠశాలలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి లేని యోడల విద్య సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ తెలిపింది. కళాశాలల పునఃప్రారంభంపై ఉన్నత విద్యావిభాగం నిర్ణయాలు తీసుకోవచ్చని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -