డయాలిసిస్ రోగుల కోసం ‘గెస్ట్స్ గాట్ టాలెంట్’

143
nephroplus

భారతదేశ అతిపెద్ద డయాలిసిస్ నెట్ వర్క్, డయాలిసిస్ సంరక్షణను పునర్ నిర్వచించడంపై దృష్టి పెట్టిన నెఫ్రో ప్లస్ తన ఫ్లాగ్ షిప్ కార్యక్రమం ‘గెస్ట్స్ గాట్ టాలెంట్’ సీజన్ 3 కి ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. ఈ విశిష్ట పోటీలకు 2020 సెప్టెంబర్ 23 నుంచి ఎంట్రీలను పంపవచ్చు. ఒక నెల రోజుల పాటు కొనసాగుతుంది. డయాలిసిస్ చేయించుకునే వారిలో ఉన్న ప్రతిభాపాటవాలను ఇది గుర్తిస్తుంది. డయాలిసిస్ రోగులు తమ నైపుణ్యాలు, సామర్థ్యాలను ప్రదర్శించే అవకాశాన్ని అందించడం ‘గెస్ట్స్ గాట్ టాలెం ట్’ లక్ష్యం.

తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించాలనుకునే డయాలిసిస్ రోగులు తమ దరఖాస్తును #GuestsGotTalent3/ #NephroPlus అనే హ్యాష్ ట్యాగ్ తో Facebook/ Twitter page (https://www.facebook.com/ NephroPlus DialysisNetwork/)పై అప్ లోడ్ చేయవచ్చు. ఇందులో పాల్గొనే వారు తమ ప్రతిభను ప్రదర్శించేలా ఒక నిమి షం వీడియో క్లిప్ / పిక్చర్ ను తమ పేరు, కాంటాక్ట్ వివరాలు, డయాలిసిస్ సెంటర్, నగరం వివరాలతో పంపిం చాలి. ప్రతీ వారం నెఫ్రో ప్లస్ ఇలా వచ్చిన ఎంట్రీలను తమ సోషల్ మీడియా పేజీలో అప్ లోడ్ చేస్తుంది. ఈ టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ చివరి రోజు వరకు అంటే 2020 అక్టోబర్ 30 వరకు ఇలా అప్ లోడ్ చేస్తారు.

టీవీ, మీడియా పరిశ్రమలకు చెందిన ప్రముఖులతో కూడా జ్యారీ సెలెక్షన్ ప్యానెల్ లో భాగంగా ఉంటుంది. అంతి మంగా షార్ట్ లిస్ట్ అయిన వారి నుంచి ముగ్గురు విజేతలను ఎంపిక చేస్తుంది. విజేతలందరికీ నెఫ్రో ప్లస్ నగదు బ హుమతిని ఇవ్వడంతో పాటుగా రేడియో చానల్ ఇంటర్వ్యూ లో పాల్గొనే అవకాశాన్ని అందిస్తుంది.

ఈ సందర్భంగా నెఫ్రో ప్లస్ వ్యవస్థాపకులు, సీఈఓ శ్రీ విక్రమ్ ఉప్పాలా మాట్లాడుతూ, ‘‘‘గెస్ట్స్ గాట్ టాలెంట్’ మూడో సీజన్ ను నిర్వహించడం నెఫ్రోప్లస్ లో మాకెంతో ఆనందదాయకం. దీని మొదటి రెండు సీజన్లకు ఎంతో స్పందన పొందాం. ప్రతి వ్యక్తి కూడా తనదైన ప్రత్యేక ప్రతిభను కలిగిఉంటారని మేము విశ్వసిస్తాం. ఈ రోగుల్లో వా రి వ్యాధినే వారి గుర్తింపుగా మారుతోంది. ఈ విధమైన ఆలోచనల నుంచి వారు బయటపడాలని, తమపై తాము నమ్మకం పెంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. ప్రపంచంలోనే ఒక విశిష్టమైన పోటీతో డయాలిసిస్ చేయిం చుకునే వ్యక్తులందరికీ వారు తమ ప్రతిభాపాటవాలను నలుగురికీ చాటిచెప్పుకునేలా ఒక అవకాశాన్ని కల్పించ డం ఈ కార్యక్రమం ద్వారా మా లక్ష్యం’’ అని అన్నారు.