1. రోజు పావు గ్లాసు గోరు వెచ్చని నీళ్లలో రెండు స్పూన్ ల తేనె కలుపుకుని తాగితే శరీరబరువు తగ్గుతుంది. రాత్రి పూట పాలలో2 స్పూన్ ల తేనె కలుపుకోని తాగితే చక్కటి నిద్ర వస్తుంది.
2. నిమ్మకాయ రసంలో తేనె కలుపుకోని తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
3.వేడి నీటిలో తేనె ,నిమ్మరసం 10 చుక్కలు వేసుకుని తాగితే ఆయాసం తగ్గుతుంది.అర గ్లాస్ తులసి ఆకు రసంలో ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.
4. తేనె నీళ్ళు పుక్కిలిస్తే నోటి దుర్వాసన ,చిగుళ్లవాపు తగ్గుతాయి.
5. తేనెలో కాస్తా మిరియాలపొడి కలుపుకుని తీసుకుంటే జలుబు నుండి ఉపశమనం పోందవచ్చు.
6. క్రీడాకారులు ఆటల్లో పాల్గోనే ముందు తేనె ,నిమ్మరసం సమభాగాలుగా చేసి తీసుకుంటే అలసట కలుగదు. ఆట ఆడిన తరువాత తీసుకుంటే ఒళ్లు నొప్పులు తగ్గుతాయి.
7. రెండు గ్లాసుల నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ ల తేనె కలిపి తీసుకుంటే డయేరియా తగ్గడానికి ఉపయోగపడుతుంది.