4 కొత్త విమాన సర్వీసులు:రామ్మోహన్

3
- Advertisement -

ఏపీలో మూడు నెలల్లోనే 4 కొత్త విమాన సర్వీసులు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. గన్నవరం ఎయిర్‌పోర్టులో అప్రోచ్‌ రహదారిని ప్రారంభించారు. అనంతరం విజయవాడ- ఢిల్లీకి ఇండిగో సర్వీసు ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్మోహన్ నాయడు.. విజయవాడ విమానాశ్రయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.

దేశం మొత్తం ఆంధ్రావైపు చూసేలా కనెక్టివిటీని పెంచుతున్నామని అన్నారు.అక్టోబర్‌ 26న విజయవాడ నుంచి పుణేకు , అక్టోబర్‌27న విశాఖ – న్యూఢిల్లీకి కొత్త సర్వీసులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. షార్జా కు ప్రస్తుతం పలు సర్వీసులు నడుస్తున్నాయని వివరించారు. దుబాయ్‌, సింగపూర్‌కు సర్వీసులను విస్తరించనున్నామని తెలిపారు.

రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్టు కొత్త టెర్మినల్‌ ఏడాదిలోగా ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు.

Also Read:KTR: ఫ్యాక్షన్ సినిమాను తలపించేలా గుండాగిరి

- Advertisement -