పెరుగుతున్న కరోనా కేసులు…కేంద్రం కీలక ఆదేశాలు

89
health
- Advertisement -

దేశంలో కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ఢిల్లీలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేసేందుకు అవసరమైతే ముందస్తు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, మిజోరాం కేంద్రం కీలక సూచనలు చేసింది.

అర్హులందరికీ టీకాలు వేయించాలని సూచించారు. ప్రత్యేకించి రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ను తప్పనిసరి చేయాలని సూచించింది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భూషణ్ ఎత్తిచూపుతూ మహమ్మారిపై ఇప్పటి వరకు చేసిన పోరాటంలో విషయం సాధించామని, ప్రస్తుతం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని సూచించారు.

కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా కొవిడ్ వ్యాప్తి పెరగకుండా చర్యలు తీసుకోవాలని ఐదు రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.

- Advertisement -