కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలపై మొదటి నుంచి కూడా కేంద్రం చిన్నచూపు చూస్తూనే ఉంది. బడ్జెట్ లో ఈ రెండు రాష్ట్రాలకు కేటాయించాల్సిన నిధులపై పక్షపాతం చూపిస్తూనే ఉంది. ఇక తాజాగా 2023-24 సంబంధించిన బర్దెట్ ను నిన్న కేంద్ర మంత్రి నిర్మలసీతరామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో కూడా తెలుగు రాష్ట్రాలపై భారీగానే కోత విధించింది. ముఖ్యంగా తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం వివక్ష చూపించింది. కేంద్ర పథకాలైన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పేదలకు ఆహార భద్రత పథకం వంటి వాటిపై భారీగా కోత విధించింది..
2022-23 బడ్జెట్ లో ఉపాధి హామీ పథకానికి రూ. 89,400 కోట్లు కేటాయించగా.. ఈ బడ్జెట్ లో మాత్రం నిధులను రూ. 60,000 కోట్లకు మాత్రమే పరిమితం చేసింది కేంద్రం. అలాగే ఆహార భద్రత పథకానికి గత బడ్జెట్ లో రూ. 2,87,194 కోట్లు కేటాయించగా.. ఈ సారి మాత్రం రూ. 1,97,350 కోట్లకు తగ్గించింది. ఇలా ఆయా పథకాల విషయంలో తెలంగాణకు రావాల్సిన నిధులలో కోత విధించింది కేంద్రం. ఇక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ చట్టంలోని హామీల ప్రకారం తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలకు రూ.1,350 కోట్లు నిధులు రావాల్సి ఉంది. వీటిపై కూడా కేంద్రం ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. అయితే కర్నాటకలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి రూ.5,300 కోట్లు కేటాయించిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపించింది. ఇక కాళేశ్వరం లేదా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ వస్తోంది.
ఈ డిమాండ్ ను కూడా కేంద్రం పెడచెవిన పెట్టింది. సాధారణంగా 15 వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు వసూలు చేసిన పన్నుల విషయంలో బడ్జెట్ నుంచి 41 శాతం నిధులను రాష్ట్రాలకు కేటాయించాల్సి ఉంది. కానీ ఈసారి బడ్జెట్ లో అలా జరగలేదు. 2022-23 లో పన్నుల నుంచి కేంద్రం వసూళ్లు రూ. 33,68,858 కోట్లుగా అంచనా.. అయితే ఇప్పుడు అందులో రాష్ట్రాల వాటా రూ. 10,21,488 కోట్లు ( అంచనా ) ఇదే విషయాన్ని మంత్రి హరీష్ రావు కూడా ప్రస్తావించారు. కేంద్రం వసూలు చేసిన మొత్తం పన్నుల్లో బడ్జెట్ లో కేటాయించింది కేవలం 31.4 శాతమే అని హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఇక సెస్ మరియు సర్ ఛార్జీలు విధించడం ద్వారా కూడా రాష్ట్రాల అధయానికి కేంద్రం భారీగా గండి కొడుతోంది. మొత్తానికి ఈ బడ్జెట్ లో కూడా తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిందనే చెప్పుకోవాలి.
ఇవి కూడా చదవండి..