పకోడీ గాళ్లకు.. జగన్ భయపడడు!

20
- Advertisement -

ఏపీలో ప్రస్తుతం అధికార వైసీపీ చుట్టూ హాట్ హాట్ డిబేట్లు జరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరుగుతున్నాయి. ఆ మద్య ఆనం నారాయణరెడ్డి సొంత పార్టీ అయిన వైసీపీపై సి‌ఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసి కొత్త రాజకీయానికి తెరతీశారు. ఇక తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏకంగా తన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసి జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో అసలు వైసీపీలో ఏం జరుగుతోందనే చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా నడుస్తోంది. ఇక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు మరో 23 మంది ఎమ్మేల్యేలు వైసీపీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని కూడా ఆయన చెప్పడంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం జగన్ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ విజయం సాధించలని గట్టి పట్టుదలగా ఉన్నారు.

అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. ఇలాంటి సందర్భంలో సొంత పార్టీ నుంచే తిరుగుబాటు చెలరేగడం జగన్ ఊహించని పరిణామమే అని చెప్పుకోవచ్చు. అయితే అసమ్మతిగా ఉన్న నేతలపై జగన్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. కాగా పార్టీని విడిచి వెళ్లే నేతల గురించి జగన్ అసలు భయపడరని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. జగన్ పై అలాగే వైసీపీ పై తనదైన రీతిలో విధేయత చూపే కొడాలి.. తాజా పరిణామాలపై తనదైన రీతిలో స్పందించారు. ” ఆనం, పెర్ని నాని, నాలాంటి 10 మంది పకోడీ గాళ్ళు పార్టీ నుంచి వెళ్ళి పోతే భయపడే పరిస్థితి జగన్ డిక్షనరీలోనే లేదని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ 23 మంది పార్టీ మారితేనే పట్టించుకోలేదని, ఇప్పుడు అసలు పట్టించుకోవాల్సిన అవసరం జగన్ కు లేదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. మొత్తానికి తాజా పరిణామాలు వైసీపీని కొంత కలవరానికి గురి చేస్తున్నాయనే చెప్పవచ్చు. మరి సొంత నేతల తురుగుబాటుపై వైఎస్ జగన్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు. ఎలాంటి ప్రణాళికలు అమలు చేయబోతున్నారు అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి…

తెలంగాణపై ఎందుకింత వివక్ష?

రైతు వ్యతిరేక బడ్జెట్‌…

పారదర్శకంగా అసెంబ్లీ సమావేశాలు…

- Advertisement -